https://www.youtube.com/watch?v=95f9NuzitZA

లక్ష సింహ ముఖాలతో... భగభగమండే కేశాలతో... త్రినేత్రాలతో అవతరించి, రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి. మణిద్విపవాసిని సమస్త జగంబులకు జనని అయిన శ్రీ లలితా దేవి ప్రచండ ఉగ్రశక్తి అవతారమే మహాప్రత్యంగిరా దేవి. కూలివాడి దగ్గర నుండి కోటిశ్వరుని వరకు....పండితుడి నుంచి పామరుడి వరకు, ప్రతి ఒక్కరికి జన్మ పరంపరగా వచ్చే కర్మలు ఉంటాయి అనేది, ఈ భూమి ఫై పుట్టిన వారి నమ్మకం, ఆ కర్మల ద్వారా సంక్రమించే శుభా, అశుభ ఫలాలు నీడలు జీవిని వెంటాడుతూనే ఉంటాయి, వీటి ప్రభావం నుంచి మనిషి తప్పించుకోవటం ఆసాద్యం, కుండపోత వర్షం నుంచి తడిసి ముద్దవకుండా గొడుగు మనిషిని ఎలా రక్షిస్తుందో... మహాప్రత్యంగిరా దేవి అమ్మవారుని శరణు వేడిన భక్తులకి అలానే అభయం ఇస్తుంది, ఇప్పుడు హైదరాబాద్ నగరం దిల్ సుఖ్ నగర్ లోని రామకృష్ణ పురంలో కోలువై ఉన్న శ్రీ మహాప్రత్యంగిరా దేవి అమ్మవారిని దర్శించుకుందాం.ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని 'నికుంభిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి

Comments