కట్టప్పకు బాలీవుడ్‌ హీరో భార్య ఫిదా

బాహుబలి2 విడుదలైన తర్వాత మొత్తం ప్రేక్షకులు సినీలోకమంతా ప్రభాస్‌, రాజమౌళి, కట్టప్ప, శివగామిలాంటి పాత్రలను తెగ పొగిడేస్తుండగా ప్రముఖ బాలీవుడ్‌ నటి, నటుడు అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా మాత్రం కట్టప్పపై మనసు పారేసుకుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యంలో బానిస సేన నాయకుడిగా సత్యరాజ్‌ పోషించిన కట్టప్ప పాత్రను తెగ ఇష్టపడుతోంది.

అందులో భాగంగా సోషల్‌ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్‌ చేసింది. తాను కట్టప్పకు ఎలా అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వివరించింది. ‘నేను బాహుబలి 2 చూశాను. నా కూతురు కోపంతో తన తండ్రిని కట్టప్ప అని పిలుస్తోంది. ఎంతలా అంటే ఒక వ్యసనంలాగా.. కట్టప్ప అని తను మూడుసార్లు అరిచేంత వరకు కూడా మేం అస్సలు అపలేకపోతున్నాం’ అంటూ ట్వింకిల్‌ ఖన్నా చెప్పుకొచ్చింది.

Comments

Popular posts from this blog

Dadadadaladistunna Sunny Leone