ఎనిమిదేళ్ల తర్వాత ఫ్యాన్స్‌తో రజనీకాంత్‌ భేటీ

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులతో​ సమావేశం అయ్యారు. సోమవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన అభిమానులతో విడతలవారీగా భేటీ అవుతారు. అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ప్రత్యేకంగా రజనీకాంత్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం రజనీకాంత్‌..అభిమానులను కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘అభిమానులను కలవడం ఆనందంగా ఉంది. త్వరలో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటా. రాజకీయాలపై నేనెప్పుడు వెనకడుగు వేయలేదు. రాజకీయ నేతలు నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయాలపై నా అభిప్రాయాన్ని చాలా ఏళ్ల క్రితమే స్పష్టం చేశాను. 21ఏళ్ల క్రితమే రాజకీయాల్లో నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఏ పార్టీలోనూ చేరను. నటనే నా వృత్తి, దేవుడు ఆదేశించాడు. ఆ పనే చేస్తాను. మీరు కూడా  ఏ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు. నా అభిమానులు నిజాయితీగా జీవించాలి. ఎలాంటి రాజకీయా అంశాలు మాట్లాడొద్దు’ అని అభిమానులకు సూచించారు.

కాగా రజనీకాంత్‌ రాజకీయాలలోకి రావాలని అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.  అలాగే పలు రాజకీయ పార్టీలు కూడా ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో పొలిటికల్‌ ఎంట్రీపై రజనీకాంత్‌..మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2009లో శివాజీ సినిమా సక్సెస్‌ మీట్‌ తర్వాత రజనీకాంత్‌ అభిమానులను కలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా తన శ్రీలంక పర్యటన వివాదంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

Dadadadaladistunna Sunny Leone