రజనీ పొలిటికల్ ఎంట్రీపై అతడి జోస్యం

ఏళ్లకు ఏళ్లుగా.. అంతుపొంతూ లేని చర్చగా సాగుతున్న అంశం ఏదైనా ఉందంటే.. అది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించే. తాజాగా తన అభిమానులతో సమావేశమైన సందర్భంగా తన రాజకీయ రంగప్రవేశం గురించి ఆయన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దేవుడు ఆదేశిస్తే.. తాను ఏదైనా చేస్తానంటూ.. గతంలో తాను సినిమాలో చెప్పిన డైలాగ్ ను కాస్త మార్చి చెప్పారు. ఇటీవల కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీ రాజకీయ రంగప్రవేశం మీద చాలానే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. వాటికి తెర దించుతూ రజనీ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

అయితే.. రజనీ రాజకీయ రంగప్రవేశం పక్కా అని చెబుతున్నారు తమిళనాడుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు సెల్వి. ఆయన పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ఆయన చెబుతున్నారు. సరైన సమయం కోసం రజనీ వెయిట్ చేస్తున్నారని.. ఇప్పుడాయనకు శనిదశ నడుస్తోందని.. అది త్వరలో ముగియనుందన్నారు. రానున్న కొన్నేళ్లలో రజనీ రాజకీయ రంగ ప్రవేశం తప్పనిసరి అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

అవినీతి పరుల్ని తన దగ్గరకు రానివ్వనని చెప్పటంతో పాటు.. నిర్ణయాల్ని హడావుడిగా తీసుకోవటం ఇష్టం ఉండదని.. తెలివిగా తీసుకోవాలని చెప్పటం చూస్తే.. ఆయనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందన్న విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదన్న రజనీ మాటల్లోనే ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లు అయ్యిందని చెబుతున్నారు. మరి.. జ్యోతిష్యుల వారి మాట నిజం అయ్యేది ఎప్పుడో చూడాలి.

Comments

Popular posts from this blog

Dadadadaladistunna Sunny Leone