పాక్‌ పైలట్‌, సిబ్బందికి లండన్‌లో షాక్‌

పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బందిని లండన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ విమానం దిగిదిగగానే వారిని అదుపులోకి తీసుకొని దాదాపు రెండుగంటలపాటు తనిఖీలు నిర్వహించి అనంతరం వదిలేశారు. ఈ విషయాన్ని పాక్‌ కాస్తంత సీరియస్‌గా తీసుకుంది. ఎలాంటి కారణం చెప్పకుండానే తమ సిబ్బందిని అలా తమ అదుపులోకి తీసుకొని ఎందుకు తనిఖీలు చేయాల్సి వచ్చిందో తమకు అర్థం కాలేదని పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) అధికారిక ప్రతినిధి మషూద్‌ తజ్వార్‌ అన్నారు.

ఈ విషయాన్ని తాము బ్రిటిష్‌ ఏవియేషన్‌ అథారిటీకి తెలియజేస్తామని అన్నారు. పీఐఏకు చెందిన విమానం పీకే 785 ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌లోని హ్యాత్రూ ఎయిర్‌పోర్టుకు సోమవారం తెల్లవారుజామున 2.50గంటల ప్రాంతంలో వచ్చింది. ప్రయాణీకులు దిగిపో​యిన వెంటనే విమాన సిబ్బందిని, విమానం మొత్తాన్ని దాదాపు రెండుగంటలపాటు తనిఖీలు చేసిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆ తర్వాత క్లియరెన్స్‌ ఇచ్చారు. అయితే, ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేసినట్లు లండన్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సమర్థించుకున్నారు.

Comments

Popular posts from this blog

Dadadadaladistunna Sunny Leone