కొత్త డిజైర్ వచ్చేసింది, ధరెంతంటే
మారుతీ సుజుకీ 2017 డిజైర్ వాహనం అధికారికంగా భారత్ లో లాంచైంది. పెట్రోల్ వేరియంట్ రూ.5.45 లక్షల ప్రారంభ ధరతో మారుతీ సుజుకీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.45 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పెట్రోలో, డీజిల్ వెర్షన్లలో ఒక్కో దానిలో నాలుగు వేరియంట్లలో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. మారుతీ సుజుకి ఇగ్నిస్ తర్వాత 2017లో మార్కెట్లోకి తీసుకొచ్చిన రెండో వాహనం ఇదే. పూర్తిగా కొత్త హీయర్టెక్ట్ ప్లాట్ ఫామ్ ను ఆధారం చేసుకుని, దీన్ని మారుతీ సుజుకీ రూపొందించింది.
మొదటిసారి స్విఫ్ట్ బ్యాడ్జ్ లేకుండా ఈ కారు విక్రయానికి వస్తోంది. తేలికైన, ఫీచర్ లోడెడ్ తో కొత్త అవతారంలో ఇది వచ్చింది. అప్పటి మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ కు ఇది చాలా భిన్నంగా రూపొందింది. అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతీ సుజుకీ కార్లలో డిజైర్ మోడల్ కూడా ఒకటి. 11వేల రూపాయల టోకెన్ మొత్తంతో ఈ కారు బుకింగ్ లను కంపెనీ ఈ నెల మొదట్లోనే ప్రారంభించింది. ఆటో గేర్ సిఫ్ట్ టెక్నాలజీని దీనిలో వాడారు.
ఈ కొత్త డిజైర్ స్పెషిఫికేషన్స్..
పొడవు... 3995 ఎంఎం
వెడల్పు....1735 ఎంఎం
ఎత్తు.........1515 ఎంఎం
వీల్ బేస్.... 2450 ఎంఎం
గ్రౌండ్ క్లియరెన్స్...163ఎంఎం
బూట్ స్పేస్....378ఎల్
Comments
Post a Comment