Posts

ఆరు సంవత్సరాలకే శృంగారం‌?

న్యూ గినియా (New Guinea, )లోని ట్రొబ్రియాండర్‌ తెగలో ఓ వింత ఆచారం అమలులో ఉంది. ఆ తెగలో ఆరు సంవత్సరాల నుంచే ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ శృంగారంలో పాల్గొనవచ్చు. తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేంత వరకూ ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. చిన్నతనంలో ఏర్పడే ప్రేమ పటిష్ఠంగా ఉంటుంది అనేది ఇక్కడి వారి నమ్మకమట!

భార్యలను దొంగతనం చేస్తారు

దక్షి‌ణాఫ్రికాలోని నైజర్‌ వదాబి అనే తెగలో ఓ వింత ఆచారం ఉంది. పండుగలు, జాతరల సందర్భంగా పురుషులు రకరకాల వేషధారణలో ఇతరుల భార్యలను దొంగిలిస్తారు. అలా సొంతం చేసుకున్న స్త్రీని తమతో తీసుకెళ్ళే హక్కు వారికి ఉంటుంది. కొందరు సరదాకి ఈ విధంగా చేస్తే మరికొందరు ఇతరుల భార్యలని కామించి వారిని దొంగతనం చేస్తారు. నాగరిక సమాజంలో దీనిని అక్రమ సంబంధంగా భావస్తాం. వదాబి తెగవాఉ ఏ అభిప్రాయంతో చేసినా ఆ స్త్రీ అప్పటి నుంచి వారి సొంతం అవుతుంది. ప్రేమ, ఆచారాల పేరుతో ఇలాంటి వికృత చేష్ఠలు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో అమలులో ఉన్నాయి. కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ఇలాంటి వికృత ఆచారాలకు ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే!

అసెంబ్లీలో ఎమ్యెల్యేల గాఢనిద్ర

ఓ వైపు దేశమంతటిన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే జీఎస్టీ బిల్లుపై చర్చ.. మరోవైపు ప్రతిపక్షాల రసాభాస అయినా  ఎమ్మెల్యేలకు నిద్రముంచుకొచ్చింది. వాళ్లేదో వారు చర్చించుకుంటారులే? మనకెందుకని ఏంచక్కా కొందరు ఎమ్మెల్యేలు కునుకు బాట పట్టారు.   ఈ సీన్ ఎక్కడో తెలుసా? బీజేపీ నేతృత్వంలో ఇటీవల పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తొలి అసెంబ్లీ సమావేశంలో. లక్నోలోని లోక్ భవన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం జీఎస్టీ బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఎంచక్కా కూర్చున్న సీట్లలోనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలన్ని మొదటిసారి లైవ్ టెలికాస్ట్ చేశారు.   తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో చూసే అవకాశం ప్రజలకి ఇవ్వాలనే యోగి యోచన మేరకు తొలిసారి ఈ టెలికాస్ట్ ను చేపట్టారు. కానీ తీరా టీవీల ముందు కూర్చుని చూసిన జనాలకి ఈ స్లీపింగ్ సీన్లు దర్శనమిచ్చాయి. నిద్ర మత్తులో జోగుతున్న వారిలో ఆ రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారంట. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు హౌజ్ లో చూడవచ్చని ముఖ్యమంత్రి ఇంతకముందే చెప్పారు. ...

కొత్త డిజైర్ వచ్చేసింది, ధరెంతంటే

మారుతీ సుజుకీ 2017 డిజైర్ వాహనం అధికారికంగా భారత్ లో లాంచైంది. పెట్రోల్ వేరియంట్ రూ.5.45 లక్షల ప్రారంభ ధరతో మారుతీ సుజుకీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.45 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. పెట్రోలో, డీజిల్ వెర్షన్లలో  ఒక్కో దానిలో నాలుగు వేరియంట్లలో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. మారుతీ సుజుకి ఇగ్నిస్ తర్వాత 2017లో మార్కెట్లోకి తీసుకొచ్చిన రెండో వాహనం ఇదే. పూర్తిగా కొత్త హీయర్టెక్ట్ ప్లాట్ ఫామ్ ను ఆధారం చేసుకుని, దీన్ని మారుతీ సుజుకీ రూపొందించింది.   మొదటిసారి స్విఫ్ట్ బ్యాడ్జ్ లేకుండా ఈ కారు విక్రయానికి వస్తోంది. తేలికైన, ఫీచర్ లోడెడ్ తో కొత్త అవతారంలో ఇది వచ్చింది. అప్పటి మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ కు ఇది చాలా భిన్నంగా రూపొందింది. అత్యధికంగా అమ్ముడుపోతున్న మారుతీ సుజుకీ కార్లలో డిజైర్ మోడల్ కూడా ఒకటి. 11వేల రూపాయల టోకెన్ మొత్తంతో ఈ కారు బుకింగ్ లను కంపెనీ ఈ నెల మొదట్లోనే ప్రారంభించింది.  ఆటో గేర్ సిఫ్ట్ టెక్నాలజీని దీనిలో వాడారు.      ఈ కొత్త డిజైర్ స్పెషిఫికేషన్స్.. పొడవు... 3995 ఎంఎం వెడల్పు....1735 ఎంఎ...

అదరగొట్టే ఫీచర్లతో రెడ్ మి4 లాంచ్

రెడ్ మి  నోట్ 4, రెడ్ మి 4ఏ గ్రాండ్ సక్సెస్ అనంతరం మరో అఫార్డబుల్ స్మార్ట్ ఫోన్ ను అదరగొట్టే ఫీచర్లతో షియోమి భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెడ్ మి 4 పేరుతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ ను 6,999 రూపాయలకు, 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ను 8,999 రూపాయలకు, 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ను 10,999రూపాయలకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. రెడ్ మి 3ఎస్, 3ఎస్ ప్రైమ్ సక్సెసర్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. అమెజాన్.ఇన్, ఎంఐ.కామ్ రెండు ఆన్ లైన్ స్టోర్లలో ఇది విక్రయానికి రానుంది.   రెడ్ మి 4 కీలక స్పెషిఫికేషన్స్... క్వాల్ కామ్ 1.4గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్ 4100ఎంఏహెచ్ బ్యాటరీ 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 13ఎంపీ రియర్ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4జీ ఎల్టీఈ బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సా...

పాక్‌ పైలట్‌, సిబ్బందికి లండన్‌లో షాక్‌

పాకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బందిని లండన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ విమానం దిగిదిగగానే వారిని అదుపులోకి తీసుకొని దాదాపు రెండుగంటలపాటు తనిఖీలు నిర్వహించి అనంతరం వదిలేశారు. ఈ విషయాన్ని పాక్‌ కాస్తంత సీరియస్‌గా తీసుకుంది. ఎలాంటి కారణం చెప్పకుండానే తమ సిబ్బందిని అలా తమ అదుపులోకి తీసుకొని ఎందుకు తనిఖీలు చేయాల్సి వచ్చిందో తమకు అర్థం కాలేదని పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ) అధికారిక ప్రతినిధి మషూద్‌ తజ్వార్‌ అన్నారు. ఈ విషయాన్ని తాము బ్రిటిష్‌ ఏవియేషన్‌ అథారిటీకి తెలియజేస్తామని అన్నారు. పీఐఏకు చెందిన విమానం పీకే 785 ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌లోని హ్యాత్రూ ఎయిర్‌పోర్టుకు సోమవారం తెల్లవారుజామున 2.50గంటల ప్రాంతంలో వచ్చింది. ప్రయాణీకులు దిగిపో​యిన వెంటనే విమాన సిబ్బందిని, విమానం మొత్తాన్ని దాదాపు రెండుగంటలపాటు తనిఖీలు చేసిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఆ తర్వాత క్లియరెన్స్‌ ఇచ్చారు. అయితే, ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేసినట్లు లండన్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సమర్థించుకున్నారు.

17 రోజుల్లో.. 1340 కోట్లు నాట్ ఔట్

ఇప్పుడు బాహుబలి 2 ఎంత వసూలు చేసింది అని ఎవ్వరూ అడగట్లేదు. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ అన్ని రికార్డులను బద్దలు కొట్టేసేంత వసూలు చేసేసింది. ఇప్పుడందరూ కూడా ఈ సినిమా ఏ రికార్డు క్రియేట్ చేసింది. కొత్తగా ఏం చేసింది.. అనే ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి అసలు బాహుబలి ప్రస్తుత రన్ ఎలా ఉందో చూద్దాం పదండి.  17 రోజుల నుండి నిర్విరామంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తున్న బాహుబలి 2.. ఏకంగా 1340 కోట్ల గ్రాస్.. అంటే షుమారుగా 668+ కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 170 కోట్ల షేర్ (255 కోట్ల గ్రాస్) వసూలు చేయగా.. కర్ణాటక నుండి 44 కోట్లు (95 గ్రాస్).. తమిళనాడు నుండి 56 కోట్లు (106 కోట్ల గ్రాస్).. కేరళ నుండి 24 కోట్లు (53 కోట్ల గ్రాస్).. తక్కిన భారతదేశం నుండి 238 కోట్ల షేర్ (605 కోట్ల గ్రాస్) వసూలు చేసిందీ సినిమా. ఇక అమెరికాలో 80 కోట్ల షేర్ (124 కోట్ల గ్రాస్).. తక్కిన వరల్డ్ బాక్సాఫీస్ నుండి 53+ కోట్ల షేర్ (100 కోట్ల షుమారు గ్రాస్) వసూలు చేసి.. మొత్తంగా 668+ కోట్ల షేర్ రాబట్టింది. అంటే ఆల్రెడీ 1340 కోట్ల గ్రాస్ వచ్చేసింది కాబట్టి.. 4వ వారం పూర్తయ్యే సరికి.. 1500 కోట్ల క్లబ్ ...